పరిటాల రవీంద్ర కన్నతండ్రి పరిటాల శ్రీరాములు. పోరాటాల శ్రీరాములుగా చరిత్రకెక్కరు. 1978 జనవరిలో విప్లవ రాచయితల సంఘం పరిటాల శ్రీరాములుగారి రచనల సంకలనం వెలువరించింది. ఆ సంకలనం పేరు - పోరాటాల శ్రీరాములు. పదిహేనేళ్ళ ప్రాయంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి కాలుమోపారు. పరిటాల శ్రీరాములు గారి యిల్లే కమ్యూనిస్ట్ పార్టీకి పుట్టినిల్లు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీకి పునాదులు వేసిన ధర్మవరపు చిన ముత్యలప్ప. శ్రీరాములు గారి తండ్రి పరిటాల ముత్యలప్పకు స్వయానా మెనల్లుడు. పరిటాల ముత్యల్లప్ప సంరక్షణలో అయిన ఇంట్లోలోనే పెరిగి పెద్దవాడయ్యరు.
భూస్వామ్య కుటుంబంలో పుట్టి,ఎస్.ఎస్.ఎల్ సి వరుకు చదవుకున్న శ్రీరాములు చిన్నతనం నుంచి తన భావ ధర్మవరపు చిన ముత్యల్లప్ప ప్రచారం చేస్తున్న సామ్యవాద భావాలకు ఆకర్షితులయ్యారు.
ఆంధ్రరాష్ట్రం ఎర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి గ్రామా పంచాయతి ఎన్నికల్లో ధర్మవరపు చిన ముత్యలప్ప నసనకోట సర్పంచ్ అయ్యరు. దీన్నిబట్టి ఆ ప్రాంతంలో పరిటాల శ్రీరాములు కుటుంబానికున్న రాజకీయ చరిత్ర, ప్రాదాన్యం అర్థం చెసుకొవఛు. పరిటాల శ్రీరాములుగారికి 1952 లో శీరీపీ కొట్టాల గ్రామానికి చెందినా రాశినేని పెద్దనారాయణప్పా గారి చెల్లెలు నారాయణమ్మతో వివాహం జరగింది.
1948-51 మధ్యకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన భూపోరాటంలో పరిటాల శ్రీరాములు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. వందలాది ఎకరాల బంజరు భూములకు నిరుపేదలు అధికారక వారసులుగా మారేందుకు జగరిన చారిత్ర్రమిక కృషిలో పరిటాల శ్రీరాములు కీలకమైన భాగస్వామి. అందుకే, అతిపిన్నవయసులోనే భూస్వాముల కళ్ళకు ప్రబశాత్రువుల కనిపించాడు. ముత్తపకుంట్ల భూస్వామి చిన్నపరెడ్డి కుమారుడు రామసుబ్బారెడ్డి అరాచకాలు పెచ్చుమీరి పోవటంతో కమ్యూనిస్ట్ పార్టీ అతకినికి బుద్ధి చెప్పాలని అనుకుంది. 1959 సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన ఈ దాడిలో తలారి నరసింహులు అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గియపడిన రామసుబ్బారెడ్డి నలుగోరోజున చనియోయాడు.
ఈ హత్యకేసులో పరిటాల శ్రీరాములు రెండో ముద్దాయి. 13 మందికి యావజ్జీవ శిక్ష పడింది. ఈ పదమూడు మందిలో శ్రీరాములుగారి తమ్ముడు గజ్జలప్ప కూడా ఒకరు.
శ్రీరాములుగారు ఇంటికి పెద్దకొడుకు. కుటుంబ ఆర్థిక స్థితి బాగా దెబ్బ తినటంతో ఆబ్కరి వ్యాపారంలోకి దిగరు. అప్పటి వరకు నసనకోట పంచాయతి కింద వున్నా 9 గ్రామాల కల్లు యిజారా భుస్వములయిన రెడ్ల చేతుల్లో వుంది. 1963లో పరిటాల శ్రీరాములు కల్లు గీత సొసైటీ ఏర్పాటు చేసి బడుగువర్గాల్లని భాగస్వాముల్ని చేశారు. అవిశ్రాంతంగా శ్రమించి, వ్యవసాయం చేసి జిల్లలోకేల్ల ఉత్తమ రైతుగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
భారత్ కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చేలిపోయింది. నసనకోట పంచాయితీ ఎన్నికల్లో పరిటాల శ్రీరాములు తన పెద్ద తమ్ముడు పెద్దనారాయణప్పను వార్డ్ మెంబెరగ గెలిపించి సర్పంచ్ పదవికై పోటికి సిద్దపడ్డాడు. ఆయిత సిపిఐ(ఎమ్) పార్టీ నాయకుడైన చలిచిమల ముత్యలప్ప కాంగ్రెస్ కు చెందినా రెడ్డి భూస్వాముల చేతులు కలిసి సర్పంచ్ పదవిని చేజిక్కించుకున్నాడు. మద్దులచేరువుకు చెందినా గంగుల నారాయణరెడ్డి, అతని అనుచేరుల్లో ముఖ్యుడు కనుముక్కల్లకు చెందినా సనే చెన్నారెడ్డి, వాళ్ళు అనుచేరులయిన యితర భూస్వాములు దురగతులు రోజురోజుకు పెరగసాగాయి. వాళ్ళ బారిన పడిన బాధితులు పరిటాల శ్రీరాములును ఆశ్రయించ సాగరు.
అదే కాలంలో ఆయనకు అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో చదువు కుంటున్న వడ్లమూడి క్రిష్ణరావుతో పరిచయం ఏర్పడింది. క్రిష్ణరావుతోపాటు మరికొంతమంది విద్యార్థులు, అనంతపురానికి చెందినా యువకులు యువజన సంఘం పేరుతో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే కాలంలో సాయుధపోరాటం అజెండాతో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అవతరించింది. యువజన సంఘం సబ్యులకు మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. విద్యర్తల ద్వార పరిటాల శ్రీరాములుగారికి విప్లవ పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. అనతికాలంలోనే రామగిరి కనగానపల్లి ప్రాంతంలో విప్లవ పార్టీకి బలమైన ప్రజపునాదులు ఏర్పడ్డాయి.
యువజన సంఘం సభ్యులు జోల్లలోని మరికొందరు ప్రగతిశీల రచయితలతో కలిసి పరిటాల శ్రీరాములు చైతన్య సాహితి పేరా ఒక సాంస్కృతిక సంస్థను స్తాపించారు. విప్లవ రచయితల సంఘం (విరసం). ఆవిర్భవించటంతో చైతన్య సాహితిని విరసంలో విలీనం చెశరు. విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గసభ్యులయ్యారు. పరిటాల శ్రీరాములుగారి యిల్లు విప్లవ పోరాట కేంద్రంగా మారింది. ఇంజనీరింగ్ విద్యార్ధి కృష్ణారావు ఆ ప్రాంతంలో వెంకటేశ్వరరావు అనే పేరుతో విప్లవ పార్టీ హోల్ టైమరగా పనిచేయటం ప్రరంభిచాడు. భూపోరాటాలు ప్రారంభమయ్యయి.
శ్రీరాములు నాయకత్వంలో విప్లవ పార్టీ కార్యకర్తలు చిన వెంకటరెడ్డి అనే భుస్వమిని బహిరంగంగ ఇంటినుంచి తీసుకువచ్చారు. ప్రజా పంచాయితీ నిర్వహించారు. వెంకట రెడ్డి శ్రీరాములు పాదాలమీద పది చేసిన తప్పుల్ని మన్నిచమని ప్రాథెయపడటంతో క్షమాభిక్ష ప్రసాదించారు. నక్సలైట్ ఉద్యమ లక్ష్యాలు ఆదర్శాలకు ఆ ప్రాంతాన్ని ఒక ప్రయోగశాలగా మర్చి విజయవంతంగా ఫలితాలను సాదించారు. రామగిరి, కగానపల్లి ప్రాంతాలు పూర్తిగా విప్లవోద్యమం ఆదీనంలోకి వచ్చాయి. శ్రీరాములు హత్యకు భారీ స్థయిలో కుట్ర జరిగింది.
అబ్కరీ వేలంపాటు సందర్భంగా శ్రీరాములు పంచన చేరిన సిద్దప్పను భూస్వాములు రహస్యంగా తమ వేపుకు తిప్పుకున్నారు. సమీప బంధువులు యింట్లో పెళ్ళికి పల్లూరు వెళ్తుండగా బస్సును అటకయించి తుపాకులతో దాడి జరిపారు. ఈ దాడిలో పరిటాల శ్రీరాములు, ఆయన తమ్ముడు పరిటాల సుబ్బాయ్య తరగకుంటకు చెందినా రామాంజనేయూలు ఎగువపల్లికి చెందినా లింగన్న అమరులయ్యారు.
Paritala Sriram First Public Speech on the day of his grand fathers Vardhanthi. A statue of his late grand father comrade Paritala Sriramulu was...
Read More...